![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. హౌస్ లోని వారంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడి అయ్యారు. హౌస్ లో ఏది ఊరికే రాదు.. రెంటర్స్ ఓనర్స్ అయ్యారు ఒనర్స్ రెంటర్స్ అయ్యారు. తనూజకి కాఫీ అంటే ప్రాణం.. రెంటర్స్ గా ఉన్నప్పుడు కాఫీ కూడా తనకి దొరకలేదు. ఇప్పుడు ఓనర్స్ అయ్యాం కదా సర్ కాఫీ పౌడర్ పంపించండి అని వీకెండ్ లో నాగార్జునతో తనూజ రిక్వెస్ట్ చేసింది. నిన్న తనకి కాఫీ పౌడర్ వచ్చింది కానీ సంజన ని ఇంప్రెస్ చెయ్యాలి.. తను ఇంప్రెస్ అయి మీకు కాఫీ పౌడర్ ఇవ్వాలని బిగ్ బాస్ మెలిక పెడతాడు.
దాంతో తనూజ కామెడీ స్క్రిప్ట్ చెయ్యాలని ఇమ్మాన్యుయల్ ని పిలుస్తుంది. తను రానని అంటాడు. ముందు పవన్ కళ్యాణ్ ని తీసుకొని వెళ్లింది. తనతో వర్క్ అవుట్ అవట్లేదని ఇప్పుడు పిలుస్తుందని ఇమ్మాన్యుయల్ అలుగుతాడు. ఇక చాలా సేపు చూస్తుంది తనూజ. నువ్వు స్క్రిప్ట్ చేసి మీ అమ్మని ఇంప్రెస్ చేసి తనూజకి కాఫీ పౌడర్ ఇప్పించమని భరణి చెప్పగానే ఇమ్మాన్యుయల్ వెళ్తాడు.
డీమాన్ పవన్ , సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్ ముగ్గురు కాలేజీలో స్టూడెంట్స్.. సుమన్ కి తనూజ లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఈ స్క్రిప్ట్ లో సుమన్, తనూజ ఇద్దరు నేచురల్ గా చేశారు. చివరికి తనూజని సుమన్ ఎత్తుకొని తిరుగుతాడు. స్క్రిప్ట్ బాగుండటంతో సంజన ఇంప్రెస్ అయి తనూజకి కాఫీ పొడి ఇస్తుంది. దాంతో లేట్ చేయకుండా తనూజ వెళ్లి కాఫీ పెట్టుకొని తాగుతుంది.
![]() |
![]() |